ఆర్ ఎల్ సి తో చర్చలు విఫలం సమ్మె బాటలో కార్మిక సంఘాలు

Published: Tuesday December 07, 2021
బెల్లంపల్లి డిసెంబర్ 6 ప్రజాపాలన ప్రతినిధి : ఈనెల 8వ తేదీలోపు ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ ఇప్పించకపోతే 9, 10, 11 తేదీలలో కార్మికులు సమ్మెకు సిద్ధం కావాలని సింగరేణి కార్మిక సంఘాల JAC పిలుపు నిచ్చింది.  హైదరాబాదులోని రీజనల్ లేబర్ కమిషనర్ ఎదుట సింగరేణి యాజమాన్యంతో సోమవారం జరిగిన ఐక్య కార్మిక సంఘాల ( జాక్) ఆధ్వర్యంలో ఐ ఎన్ టి యు సి, ఏఐటీయూసీ, టీబీజీకేఎస్, సి ఐ టి యు, హెచ్ ఎం ఎస్, బి ఎం ఎస్, నాయకులు జరిపిన చర్చలు విఫలమైనట్లు ఐ ఎన్ టి యు సి సెక్రటరీ జనరల్. బి.జనక్ ప్రసాద్  తెలిపారు. రీజనల్ లేబర్ కమిషనర్ మధ్యవర్తిత్వం వహించి సింగరేణి యాజమాన్యం ద్వారా ఈ నెల 8 వ తేదీ లోపు ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ ఇప్పించి సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులు సింగరేణికే దక్కేలా, ఇతర 12 డిమాండ్ల పై చర్చించడానికి ఆర్ఎల్సీ చొరవ చూపాలని పేర్కొన్నారు. లేకపోతే సింగరేణిని ప్రైవేటీకరణ నుండి కాపాడుకోవడానికి సమ్మె అనివార్యమని, కార్మికుల సమ్మెకు సిద్ధంగా ఉండాలని కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిస్తున్నట్లు ఆయన తెలిపారు.