సకాలంలో స్పందించని అధికారులు

Published: Monday May 31, 2021

మే 30, ప్రజాపాలన ప్రతినిధి : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద పూర్తిగా తడిసి ముద్దైన ధాన్యం బస్తాలు, శనివారం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షాలకు ధాన్యం బస్తాలు పూర్తిగా తడిసి పోయాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. పండించిన ధాన్యాన్ని అమ్మేందుకుఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వేచి ఉన్న రైతులందరు ఆందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా భారీ గాలివానతో కురిసిన వర్షానికి ధాన్యం బస్తాలు పూర్తిగా తడిసి ముధైయ్యాయని, అధికారులు స్పందించి సకాలంలో తగు చర్యలు తీసుకుంటే ఇలాంటి దుస్థితి ఎదురయ్యేది కాదని, సివిల్ సప్లై అధికారులు ఉన్నారా లేరా అన్నట్టు వ్యవరిస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.