ఆదివాసి పోరు గర్జన సభ చలో ఇంద్రవెల్లి ** తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కొట్నాక విజయ్ **

Published: Friday December 09, 2022
ఈనెల 9న చలో ఇంద్రవెల్లి సభ పోస్టర్లు విడుదల **
 
ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 8(ప్రజాపాలన, ప్రతినిధి) : ఆదివాసి హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసి అస్తిత్వ పోరు గర్జన సభ ఇంద్రవెల్లి మండలంలో ఈనెల 9న  జరగనున్నట్లు తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు కోట్నాక విజయ్ కుమార్ తెలిపారు. గురువారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చలో ఇంద్రవెల్లి లో జరగనున్న ఆదివాసి అస్తిత్వ పోరు గర్జన సభకు కేబి జిల్లా నుండి అధిక సంఖ్యలో తరలివచ్చి ఆదివాసి హక్కులను వ్యతిరేక విధి విధానాలను తిప్పికొట్టాలని ప్రతి ఆదివాసి నడుం బిగించి కాలి రావాలని హక్కులను కాపాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఉపాధ్యక్షుడు కోవా విజయ్, నాయకులు రాజేశ్వర్, సాయినాథ్, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.