నూతన ఓటర్లు నమోదు కార్యక్రమం

Published: Monday November 29, 2021
బోనకల్ నవంబర్ 27 ప్రజాపాలన ప్రతినిధి: రాష్ట్ర ఎన్నికల సంఘం మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జనవరి 1 2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు కొత్తగా ఓటర్ నమోదుకి దరఖాస్తు చేయడానికి భారత ఎన్నికల సంఘం ప్రత్యేక షెడ్యూల్ విడుదల చేసింది. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద బూత్ లెవల్ అధికారి (బి ఎల్ ఓ) నవంబర్ 27 28 తేదీల్లో మీకు అందుబాటులో ఉంటారు. అక్కడే ఫారం-6 నింపి, ఒక కలర్ ఫోటో, మీ SSC మెమో జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వగలరు. ఎవరైనా మరణించినచో లేదా గ్రామంలో నివాసం లేనిచో ఓటరు జాబితా నుండి తొలగించుటకు అక్కడే ఫారం 7 నింపి ఇవ్వగలరు. ఫారం నంబర్- 8 ద్వారా ఇంటి పేరు , ఓటరు పేరు , లింగం, వయస్సు, చిరునామా, పోటొ ఇతర వివరాలు సవరణ చేసుకోవచ్చు. ఫారం నంబర్ 8-A ద్వారా 18- నియోజకవర్గ లోని ఒక పొలింగ్ కేంద్రం నుండి మరొక పోలింగ్ కేంద్రానికి మీ ఓటరు గుర్తింపు ను బదిలీ చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో వీలుకానివారు ఆన్లైన్లో కూడా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలియజేయడం జరిగింది. ఈ ఓటరు నమోదు మరియు సవరణలకు చివరి తేదీ 30-11-2021 వరకు గలదు. కావున ఓటరు నమోదు ప్రక్రియ కార్యక్రమాన్ని మండలంలోని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం తెలపడం జరిగింది.