*సాలు 'మోడీ'ఆధాని కోసం పేదలను ఆగం చేయక* *గ్యాస్ ధరలపై నిరసనలు'సెగ '* -మధ్య తరగతి కుటుంబాలకి కట్టె

Published: Saturday March 04, 2023

చేవెళ్ల మార్చి 3, lప్రజాపాలన):-

కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట  గ్యాస్ ధరల పెరుగుదలను  నిరసిస్తూ పేద మధ్యతరగతి  ప్రజలకు నెత్తిన. గుది బండల మారిందని, చేవెళ్ల నియోజకవర్గం లో స్థానిక ఎమ్మెల్యే  కాలే యాదయ్య ఆధ్వర్యంలో బి ర్ స్ పార్టీ  శ్రేణులు
రాస్తారోకో నిర్వహించి, ఆందోళన చేపట్టారు.  తెలంగాణ రాష్ట్ర  ఐటీ పురపాలక శాఖ మంత్రి కెటీఅర్ పిలుపు  మేరకు రాష్టం   బి ర్ స్  పార్టీ శ్రేణులు రాస్తో రోకో  చేసి నిరసన తెలియజేసారు.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కాలే  యాదయ్య మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాల గుండెల్లో రైళ్లు పరుగేతే విదంగా  వంట గ్యాస్ ధరలు
పెరిగాయని, మండిపడ్డారు.నిత్యం వాడే గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు పెపు, గుదిబండలా మారిందని, గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ ఎత్తేసి తరచూ ధరలు పెంచుతు ఆదాని,  అంబనీ,కార్పొరేట్ సంస్థ లకు, దోచిపెడుతుందని, ఆగ్రహం వ్యక్తం చేశారు.  వాణిజ్య సిలిండర్లపై 350 రూపాయలు పెరగడంపై హోటల్లో చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అనంతరం మోడీ  డౌన్ డౌన్ అంటూ దిష్టి బొమ్మను  దహనం చేసారు.వచ్చే ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఎంపీపీలు విజయలక్ష్మి రమణారెడ్డి, గోవర్ధన్ రెడ్డి,జడ్పిటిసిలు మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి,కాలే  శ్రీకాంత్, ఏఎంసీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, చేవెళ్ల మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శేరి  శివారెడ్డి
వివిధ మండలాల  ఎంపీటీసీలు సర్పంచులు  ప్రజా సంఘాల నాయకులు  పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.