పెండింగ్ స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాల

Published: Thursday November 18, 2021
మధిర నవంబర్ 17 ప్రజాపాలన ప్రతినిధి : భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముట్టడించటం జరిగింది.. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వడ్రాణపు మధు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్‌‌షిప్, ఫీజు రీయింబర్స్‌‌మెంట్ రెండేండ్లుగా చెల్లించడం లేదు. దీంతో దాదాపు రూ.3,100 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్‌‌షిప్, ఫీజు రీయింబర్స్‌‌మెంట్ కోసం దాదాపు 15 లక్షల మంది విద్యార్ధులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు డబ్బులు కట్టకపోవడంతోసర్టిఫికెట్ ఇవ్వడం లేదు దీంతో విద్యార్థులకు ఉన్నత చదువులకు వెళ్ళాలంటే తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొందరు పేరెంట్స్‌‌ బయట అప్పు తెచ్చి కాలేజీ ఫీజులు కడుతున్నారు. తెచ్చిన అప్పులకు రోజురోజుకు వడ్డీ పెరిగిపోతోందని, సర్కార్ వెంటనే బకాయిలు విడుదల చేయాలని వారు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా సుమారు 12.5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు స్కాలర్‌‌షిప్, ఫీజు రీయింబర్స్‌‌మెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు రూ.2,400 కోట్లు అవసరమవుతాయి. 2019–20 అకడమిక్ ఇయర్ కు గాను రాష్ట్ర సర్కార్ సగం బకాయిలు కూడా చెల్లించలేదు. ఇంకా రూ.800 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇక 2020–21కి సంబంధించి పూర్తిగా చెల్లించలేదు. విధ్యార్ధులకు స్కాలర్‌‌షిప్, ఫీజు రీయింబర్స్‌‌మెంట్ శాంక్షన్‌‌ చేసి, టోకెన్లు జారీ చేస్తున్నా అకౌంట్లలో మాత్రం డబ్బులు పడటం లేదు. మొత్తం రెండేండ్లకు కలిపి రూ.3,100  కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని, అత్యధికంగా బీసీ సంక్షేమ శాఖలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కేంద్రం ఎస్.సి, ఎస్.టి విద్యార్థులు ఉపకార వేతనాలు ఇచ్చే డబ్బులు కూడా ఇతర పథకాలు వాడుతున్నారు అని విమర్శించారు.. విద్యార్థులు చనిపోతున్నా కనికరం లేదు: స్కాలర్‌‌షిప్, ఫీజు రీయింబర్స్‌‌మెంట్ పెండింగ్ లో ఉండడంతో కాలేజీ బకాయిలు చెల్లిస్తేనే, సర్టిఫికెట్లు ఇస్తామని అంటున్నాయి. దీంతో డబ్బుల్లేక చాలామంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఇంకొంత మంది ఫీజులు చెల్లించలేక, సర్టిఫికెట్లు కాలేజీలోనే వదిలేసి పైచదువులు ఆపేస్తున్నారు. ఓవైపు కరోనా, మరోవైపు ఫీజులు రాకపోవడంతో రాష్ట్రంలో చాలా కాలేజీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తాసిల్దార్ కార్యాలయం ముట్టడి అనంతరం ఎమ్మార్వోగా వినతిపత్రం అందించడం జరిగింది.. ఈ సందర్బంగా ఎం ఆర్ ఓ మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల పేరుతో విద్యార్థులను ఇబ్బంది పెట్టినా సర్టిఫికెట్స్ ఇవ్వక పోయిన, కళాశాలలో అనుమతించకపోయినా, కాలేజీలపై కఠిన చర్య తీసుకుంటామని కాలేజీ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి, విద్యార్ధులకు వచ్చే స్టైఫండ్ విద్యార్థులు స్టైఫండ్ తోనే విద్యను బోధించే విధంగా చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు హామీ ఇవ్వటం జరిగింది.. ఈ కార్యక్రమంలో విద్యాశాఖాధికారి ఎం.ఈ.ఓ కూడా పాల్గొన్నారు. ఎమ్ ఆర్ ఓ విద్యాధికారి ఎం ఈ ఓ హామీ ఇవ్వటంతో విద్యార్థి నాయకులు విద్యార్థులు ముట్టడిని విరమించటం జరిగింది..