నూతన దంపతులను ఆశీర్వదించిన, ఎంపీ నామ

Published: Tuesday June 29, 2021
పాలేరు, జూన్ 28, (ప్రజాపాలన ప్రతినిధి) : నేలకొండపల్లి మండలం, చెన్నారం గ్రామంలో ఇటీవల వివాహం చేసుకున్న మంకెన అజయ్ కుమార్, పూజిత నూతన దంపతులను సోమవారం నాడు వారి నివాసానికి వెళ్లి టిఆర్ఎస్. లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గారు ఆశీర్వదించారు...అనంతరం అదే గ్రామంలో మంకెన అజయ్ కుమార్ తాత గారు మంకెన కృష్ణయ్య గారిని పరామర్శించి ఆయన బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర. టిఆర్ఎస్ నాయకులు మద్దినేని బేబీ స్వర్ణకుమారి, వజ్జా శ్రీనివాసరావు, చాగంటి మధుసూదన్ రావు, మంకెన వెంకటేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.