హబ్సిగూడలో యూరో కిడ్స్ ప్లే స్కూల్ ప్రారంభించిన ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి కార్పొరేటర్ చేతన

Published: Monday June 20, 2022
మేడిపల్లి, జూన్19 (ప్రజాపాలన ప్రతినిధి)  
 హబ్సిగూడ డివిజన్లోని రవీంద్ర నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటుచేసిన యూరో  కిడ్స్ ప్లే స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. హబ్సిగూడలో              యూరో కిడ్స్ ప్లే స్కూల్ ప్రారంభించడం 
అభినందనీయమని ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూరో  కిడ్స్ ప్లే స్కూల్ నిర్వాహకులు వినోద్ రెడ్డి, నలనీ రెడ్డి, ఓ యూ సిఐ రమేష్, కుషాయిగూడ సిఐ మన్మోహన్, మాజీ ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం రెడ్డి, రవీందర్ నగర్ కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సిద్దిక్, టీఆర్ఎస్ నాయకులు జనుంపల్లి  వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.