ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి - ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Published: Saturday February 06, 2021
జగిత్యాల, ఫిబ్రవరి 05 (ప్రజాపాలన): జగిత్యాల మండలం అంతర్గామ్ గ్రామంలో
స్వశక్తి సంఘాలు ఐసిఎస్ ఫౌండేషన్ తెలంగాణ ప్రభుత్వం సహకారంతో మహిళా స్వశక్తి సంఘాలు ఏర్పాటు చేసుకున్న పసుపు ధాన్యాల శుద్ధి యంత్రన్నీ స్థానిక ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని తెలంగాణ ప్రభుత్వ సహకారంతో మహిళా స్వశక్తి సంఘాలు ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆర్దిక సహకారంతో పెట్టుబడి పెట్టి ఏర్పాటు చేసుకున్న నాణ్యమైన ఉత్పత్తులతో ఆదర్శంగా నిలవడమే కాకుండ లాభాల బాట పట్టి ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అతి తక్కవ వడ్డీకే ప్రభుత్వం రుణాలిచ్చి మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ అన్నారు. స్వ‌రాష్ట్రంలో మ‌హిళాల‌కు అత్యంత గౌర‌వ‌మిస్తూ మ‌హిళా సంఘాలు ఆర్దికంగా ఏదిగేందుకు ప్రభుత్వం 500 కోట్ల‌తో ఎన్నో ప్రోత్సాహ‌కాలు అందిస్తోంద‌ని స్వశక్తి సంఘాలంటే శ్రీశక్తి సంఘాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగారాం గౌడ్ డి.ఆర్.డి.ఓ పీడీ లక్ష్మీనారాయణ నక్కల రవీందర్ రెడ్డి సర్పంచ్ బోనగిరి నారాయణ ఎంపీటీసీ శ్రీనివాస్  నోముల శేఖర్ రెడ్డి  జాన్ గంగరాజం శ్రీనివాస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.