అయ్యప్ప స్వామి ఆలయంలో 27న మహా పడిపూజ ** ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు ఆహ్వానం **

Published: Friday December 23, 2022

ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 22 ప్రజాపాలన, ప్రతినిధి) : ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప మండల మహా పడిపూజ ఈనెల 27వ తేదీ మంగళవారం ఉంటుందని ఈ మహోత్సవానికి ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వాములు, తదితరులు గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు కు మర్యాదపూర్వకంగా కలిసి అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమములో అయ్యప్ప స్వామి భక్తులు శ్రీమంతుల వేణుగోపాల్ స్వామి,గాదేవేణి మల్లేష్ స్వామి,బట్టుపెళ్లి సంతోష్ స్వామి,శ్రీనివాస్స్వామి,బాపు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.