భారీ వర్షాలతో రాకపోకలకు అంతరాయం : పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు

Published: Friday July 23, 2021
ఇబ్రహీంపట్నం, జూలై 22 (ప్రజాపాలన ప్రతినిధి) : మండల కేంద్రంలో మరియు మండలంలోని గ్రామాలలో గత రెండు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షం కు ఇబ్రహీంపట్నం వర్ష కొండ గ్రామాల మధ్య రోడ్డుపై నుండి వర్షపు నీరు పొంగి పొర్లు తుండడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బంది ఎదుర్కొన్నారు. వివిధ గ్రామాల్లో చెరువులు వాగులు నిండు కుండలా మారాయి. గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి వర్షపు నీరు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి సంవత్సరం భారీ వర్షాలు కురిసినప్పుడు ఇబ్రహీంపట్నం, వర్ష కొండ, డబ్బా, ఎర్దడి గ్రామాల మధ్య ఉన్న వాగులు, చెరువులు పొంగడంతో రోడ్ల పైకి సైతం వరద నీరు రావడంతో, కనీస సౌకర్యాలు అంబులెన్స్ కు బస్సులకు వచ్చే అవకాశం కూడా లేకుండా పోతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ గ్రామాల మధ్యలో ఉన్న, లో లెవెల్ వంతెనలను, హై లెవెల్ వంతెనలుగా, అధికారులు తీర్చిదిద్దాలని, రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఇరు  గ్రామాల మధ్య ప్రజలు కోరుతున్నారు.