ఫోటో ఎక్స్పో క్యాలెండర్ ఆవిష్కరించిన: ఎస్సై కొండలరావు

Published: Saturday October 09, 2021

బోనకల్, అక్టోబరు 8, ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండలం ఫోటో అండ్ వీడియో గ్రఫీ అసోసియేషన్స్, మండల అధ్యక్షులు మామిళ్ల నరసింహారావు ఆధ్వర్యంలో ఫోటో ఎక్స్పో అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో జరుగు  కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు జిల్లా అధ్యక్షులు నాగరాజు దేవర, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మారగాని వెంకట, బోనకల్ ఎస్ఐ కొండల్ రావు ఎక్స్పోపోస్టర్లను ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కార్యదర్శి ఇ భాస్కర్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్సై  మాట్లాడుతూ ఫోటోగ్రఫీ అనేది ఒక కళ తరతరాలుగా చూసుకునేది ఫోటోగ్రఫీ, ఫోటోఎక్స్పో  ని విజయవంతం చేయాలని అని సూచించారు.  జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఫోటోఎక్స్పో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అని ప్రతి ఫోటోగ్రాఫర్ హైదరాబాదులో  జరుగు ఫోటోఎక్స్ పో ని విజయవంతం చేయాలనికోరారు. ఈ కార్యక్రమంలో బల్లి శ్రీనివాసరావు, జాల శివాజీ, కొత్తపల్లి రాంబాబు, కొత్తపల్లి రాజేష్, పైడి పల్లి కృష్ణ, మదర్ సాహెబ్, భానోత్ ప్రసాద్, చింతకాని మండలం సభ్యులు నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.