రైతు సమస్యల పై బూర్గంపాడు తాహాశీల్దార్ భగవాన్ రెడ్డి కి వినతిపత్రం అందచేసిన మండల కాంగ్రెస్

Published: Friday November 25, 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం తెలంగాణ  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి,సిఎల్పీ నేత భట్టి విక్రమార్క,డిసిసి అధ్యక్షులు భద్రాచలం సభ్యులు పోదెం వీరయ్య  ,పిలుపు మేరకు మండల కేంద్రంలో రైతు సమస్యలపై ర్యాలీ నిర్వహించి అనంతరం తాహాశీల్ధార్ భగవాన్ రెడ్డి కి మండల కాంగ్రెస్ శ్రేణులు కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది.
ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో ప్రభుత్వం  అధికారంలోనికి వచ్చిన నాటి నుండి నేటి వరకు రైతు లు వారి బుణాలు మాఫీ కి నోచుకోవట్లేదు అని, రైతుల బ్యాంక్ ఖాతాలను బ్యాంక్ వారు హోల్డ్ ఉంచి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ధరణి పోర్టల్ ని తిసుకవచ్చి ధరణి లో అప్లోడ్ అయి ఉన్న భూముల వివరాలు ప్రవేట్ వ్యక్తుల చెతులకు వెళ్తుంది అని,ధరణి పోర్టల్ వలన రైతులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని,రైతు బంధు సరైన టైంకి అందక పోవడం,రైతులకు అందవలసిన ఇన్పుట్ సబ్సిడిలు అందకపోవడం రైతాంగ అంతా కుడా దీనవస్ధలోనికి వెళ్తున్న పరిస్ధితి కన్పిస్తుంది అని , రాహుల్ గాంధీ గారి వరంగల్ డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ,రైతాంగం అంటే దేశానికి వెన్నుముక్క గా తాయరుచేయడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అని ఈ సమస్యలను వెంటనే పరిష్కరించక పోతే భవిష్యత్ లో టిఆర్ఎస్ పార్టీ భారి మూల్యం చెల్లించుకోక తప్పదు అని,30వ తేదిన నియోజకవర్గ కేంద్రంలో జరిగే నిరసన దీక్షను రైతులు అధిక సంఖ్యలో పాల్గోని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు 
ఈ కార్యక్రమంలో  టీపీసీసీ సభ్యులు తాళ్ళూరి చక్రవర్తి, నియోజకవర్గ నాయకులు బట్టా విజయ గాంధీ అధ్యక్షుడు కృష్ణా రెడ్డి, ప్రధాన కార్యదర్శి చల్లా వెంకట నారాయణ, ఐ ఎన్ టి యు సి ఉమ్మడి రాష్ట్రాల కార్యదర్శి యారం పిచ్చిరెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మైమూద్ ఖాన్ ,నియోజకవర్గ మహిళా బి బ్లాక్ అధ్యక్షురాలు బర్ల నాగమణి ,నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ పోతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కణితి కృష్ణ మాజీ మండల అధ్యక్షులు బెల్లంకొండ వాసుదేవ రావు, పూలపెల్లి సుధాకర్ రెడ్డి ,టౌన్ అధ్యక్షుడు మందా నాగరాజు, భాగి వెంకట్రావు యారం నాగిరెడ్డి కువారపు వెంకటేష్ పోలుకొండ ప్రభాకర్ మాదిశెట్టి లక్షణరావు ఎస్కె చోటే తాటి వీరంజనేయులు ముర్రం రాంబాబు దునుకు రాము రహీం ఖాన్ తదితరులు పాల్గోన్నారు.