14 న జరిగే విద్యాసంస్థ ల బంద్ ను జయప్రదం చేయండి ఏఐఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ పి డి ఎస్ యు*మధిర జూలై 10 ప్రజా

Published: Monday July 11, 2022
వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగే పాఠశాల బంద్ ను విజయవంతం చేయండి*
మధిర:ఈ నెల 14 న జరిగే విద్యాసంస్థ ల బంద్ ను జయప్రదం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు తీసుకున్న నిర్ణయం మేరకు నేడు స్థానిక మధిర పట్టణంలోని ఎంప్లాయిస్ యూనియన్ ఏ ఐ టి ఎయ  భవన్లో ఏఐఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ పిడిఎస్యు విద్యార్థి సంఘాల నాయకులు సమావేశం నిర్వహించి బంద్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సంధర్భంగా ఏఐఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా అధ్యక్షులు  మడుపల్లి లక్ష్మణ్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వడ్రానపు మధు పిి డి యు ఎస్ జిల్లా కోశాధికారి అక్కుల కిరణ్* మాట్లాడుతూ రంగ సమస్యల పరిష్కరించాలని  ననాణ్యమైన విద్య ప్రతి ఒక్కరి హక్కు వాటిని అందరికీ అందించడం ప్రభుత్వాల బాధ్యతఅలాంటి ప్రభుత్వాలు బాధ్యత మరచి ప్రభుత్వ పాఠశాలలను చిన్నచూపు చూస్తున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయలేదని మౌలిక సదుపాయాలు విస్మరించి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తుంది , ఇదే అదునుగా ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులపై అధిక పీజులు మోపి ఇబ్బందులకు గురిచేస్తున్నారు, ప్రభుత్వ పాఠశాలల్లో చెరదమంటే మౌలిక సదుపాయాలు లేక పోవటంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారుఇప్పటివరకు అన్ని మండలాల్లో రెగ్యులర్ ఎంఈఓ లను నియమించలేదు, మన ఊరు _మన బడి కార్యక్రమానికి అనుకున్న స్థాయిలో నిధులు మంజూరు చేయక పోవడం విద్యార్థి లోకాన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది , అదేవిధంగా నేటికీ విద్యార్థులకు 100%పుస్తకాలు, యూనిఫామ్ ల పంపిణీ జరగలేదు, మధ్యాహ్న భోజనానికి   నిధులు సమయానికి విడుదల చేయడం లేదు, పౌష్టిక ఆహారాన్ని అందించడం లేదు, ఇటువంటివి అన్నీ విద్యార్థులను తీవ్ర నష్టానికి గురిచేస్తున్నాయి కాబట్టి సమస్యల పరిష్కారానికై, పలు డిమాండ్స్ నేరెవరే వరకు ఉద్యమి0చాల్సిన అవసరముందని విద్యార్థి లోకానికి పిలుపినిచ్చారు,వీటన్నింటికీ నిరసనగా ఈ నెల 14 న నర్సరీ నుండి పదో తరగతి వరకు వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టే బంద్ కు స్వచ్ఛందంగా సహకరించాల్సిందిగా, విద్యార్థులను, వారి తల్లదండ్రులను,విద్యాసంస్థ యాజమాన్యాలను కోరారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా నాయకులు యంగల ఉజ్వల్ మొండితోక లక్ష్మణ్ sfi జిల్లా కమిటీ సభ్యులు జగదీష్ సైధా ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు నవీన్ వంశీ రమణ తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area