నగరానికి అతి సమీపంలో ఉన్న ఆదిభట్ల మున్సిపల్ పరిధిలోని కొంగరకలాన్రో డ్లకు నోచుకోని కొంగర పట

Published: Friday July 15, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 14 ప్రజాపాలన ప్రతినిధి.

ఆదిభట్ల మున్సిపల్ కొంగరకలన్లో రోడ్డు కొరకు మూడు కోట్ల 50 లక్షలు మంజూరైన శిలా ఫలకం  కొబ్బరికాయలకు మాత్రమే పరిమితమైందని అంబేద్కర్ విగ్రహం నుండి కొంగర తండా వరకు సిసి రోడ్డు వేయవలసి ఉంది గత  ఆరునెలలుగా గడుస్తున్నా సిసి రోడ్లు వేయకపోవడం గమనార్థం  నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న  అధికారులు కౌన్సిలర్లు ఒకవైపు అభివృద్ధి పదంలో దూసుకెళ్తోంది అన్న  తెలంగాణ ప్రభుత్వం చెప్పే మాటలకు చేసే పనులకు ఎక్కడ పొంతనలేదని కేవలం ఎలక్షన్లలో నిలబడి ఓట్ల కోసమే ఇలాంటి మాయ మాటలు చెప్పి గద్దెనెక్కుతున్నారని ఓట్లు జరిగేటప్పుడు దళితుల పేరు చెప్పుకొని ఓట్లు దండుకొని గెలిచిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవడంలేదని కొంగరకలాన్ గ్రామస్తులు వాపోతున్నారు.ఇప్పటికీ పట్టించుకోని అధికారులు ప్రజలు ఎంతో ఇక్కట్లతో ఇబ్బందులు పడుతుంటే ససేమిరా అంటున్న కౌన్సిలర్స్ అధికారులు నిధులు ఎక్కడ పోయినట్టు కమిషనర్ చైర్మన్ ఏం చేస్తున్నట్టు చైర్మన్ ఊర్లోనే ఇంత ఇబ్బంది ఆ ప్రజలకు రోడ్డు లేక వర్షాలతో నడవలేని  పరిస్థితి ఇకనైనా ప్రభుత్వం గుర్తించి సిసి రోడ్లు వెంబడే వేయాలని స్థానికులు తెలిపారు.