అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి

Published: Wednesday December 07, 2022
వైయస్సార్ తెలంగాణ దళిత విభాగం జిల్లా అధ్యక్షులు మద్దెల మధిర డిసెంబర్ 6 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు వైయస్సార్ తెలంగాణ దళిత విభాగ జిల్లా అధ్యక్షుడు మద్దెల ప్రసాద్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను అధికారులు ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మధిర నియోజకవర్గం కోఆర్డినేటర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు డాక్టర్ మద్దెల ప్రసాద్ రావు డిమాండ్ చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మంగళవారం మధిర అంబేద్కర్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి వర్రే మరియ దాసు మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు మస్తాన్ పాషా మండల అధ్యక్షుడు ఐలూరి ఉమామహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు