ఆళ్ళపాడు అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ్ కార్యక్రమం

Published: Wednesday March 29, 2023

బోనకల్, మార్చి 28 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామ అంగన్వాడీ కేంద్రాలలో పొషన్ పక్వాడ్ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్పంచి మర్రి తిరుపతి రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ మర్రి తిరుపతిరావు మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు మెరుగుపడే విధంగా తల్లిదండ్రులు అంగన్వాడీ టీచర్లు బాధ్యత తీసుకొని వారికి సరిఅయిన పొశాక పదార్థాలు ఇచ్చి మంచి ఆరోగ్యానికి అలవాట్లు ఇవ్వాలని ప్రతిరోజు క్రమ తప్పకుండ రోజువారి ఆహారం కోసం ఆకు కూరలు సిరుదన్యాలు కూడిన ఆహారం ఇచ్చి అంగన్వాడీ సెంటర్ లో పిల్లల అలానే పలానా చూడాలని తల్లులు కొంత టైమ్ ఇచ్చి వారి భవిష్యత్తు మెరుగుపడే విధంగా క్రుషి చేయాలన్నారు. అనంతరం అన్న ప్రశ్న కార్యక్రమాలు బాల అమృతంతో తయారు చేసిన పిండి వంటలు తయారు చేసి రుచి చూపించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిడిపిఓ కమల ప్రియ, సూపర్ వైజర్ రమాదేవి ,అంగన్వాడీ టీచర్లు హుసేన్ బీ, పద్మ గౌరమ్మ, పిల్లల తల్లులు, అంగన్వాడి అయాలు పాల్గొన్నారు.