బెల్లంపల్లి లోనే మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలి.

Published: Tuesday June 01, 2021

.. ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
బెల్లంపల్లి, మే 31, ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం మంచిర్యాల జిల్లా కు మంజూరు చేసిన మెడికల్ కళాశాలను బెల్లంపల్లి లోనే ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. సోమవారం నాడు తన పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్కి వెళ్లిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, లకు కలిసి వారి ఆశీర్వచనాలు పొంది అనంతరం మెడికల్ కళాశాల కోసం విజ్ఞాపన పత్రాన్ని అందజేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంచిర్యాల జిల్లాకు కేటాయించిన మెడికల్ కళాశాలను బెల్లంపల్లి పట్టణంలోనే నిర్మించాలని, అందుకు బెల్లంపల్లి పట్టణంలో అనుకూలమైన వందలాది ఎకరాల ప్రభుత్వ స్థలం మరియు గతంలో నిర్మించిన అసంపూర్తి భవనాలు, సిబ్బందికి అవసరమయ్యే సింగరేణి క్వార్టర్స్, మరియు రవాణాకు అనుకూలమైన రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, నాలుగుదారుల జాతీయ రహదారి లాంటి అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, అంతేకాకుండా బెల్లంపల్లి పట్టణం మంచిర్యాల మరియు కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలకు మరియు మంచిర్యాల, చెన్నూరు, అసిఫాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు మధ్యలో ఉంటుందని, బెల్లంపల్లి పట్టణంలో మెడికల్ కళాశాల నిర్మిస్తే రెండు జిల్లాల మరియు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల ప్రజలకు అందరికీ వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచిర్యాల జిల్లాకు కేటాయించిన మెడికల్ కళాశాలను బెల్లంపల్లి పట్టణంలోనే నిర్మించాలని వినతిపత్రం అందచేయగా రాష్ట్ర ముఖ్యమంత్రి,కేసిఆర్ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కేటిఆర్  సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.