*కొందుర్గు జిల్లేడు చౌదరి గూడ మండల కేంద్ర బిందువైన లాల్ పహాడ్ లో సూపర్ కాటన్ జిన్నింగ్ అండ్ ప

Published: Thursday January 12, 2023
*ప్రజాపాలన కొందుర్గు* :: *కొందుర్గు జిల్లేడుచౌదరి గూడ ఉమ్మడి మండలాల కేంద్రబిందువైన లాల్ పహాడ్ చౌరస్తా సమీపంలోని కంకల్ రోడ్ లో పక్కన నిర్మించిన సూపర్ కాటన్ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర హోంశాఖ మంత్రి ఎండి మహమ్మద్ అలీ షాద్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అక్కడికి విచ్చేసి రిబ్బన్ కట్ చేసి మిల్లులోని వివిధ విభాగాలను ప్రారంభించారు అనంతరం హోం శాఖ మంత్రి మహమూద్ అలీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ కొందుర్గు చౌదరిగూడ మండలాల్లో ఎక్కువగా ప్రత్తిని సాగు చేయడం జరుగుతుంది సాగైన పత్తిని అమ్మడానికి ఎన్నో ఇబ్బందులు పడి షాద్నగర్ మిల్లుకు తరలించేవారు అక్కడ సరైన రేటు లేక ఎన్నో అవస్థలు ఎదుర్కొనేవారు ఇప్పుడు రెండు మండలాలకు అతి చేరువలో ఈ మిల్లును ఏర్పాటు చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు అదేవిధంగా రైతులకు మేలు చేసే విధంగా ఈమిల్లును రన్ చేయాలని కోరారు ఈమిల్ మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లాలని అన్నారు ఈ సందర్భంగా సూపర్ కాటన్ జన్నింగ్ మీల్ అధినేత మహమ్మద్ ఇక్బాల్, సూపర్ కాటన్ జిన్నింగ్ మిల్ వర్కింగ్ పాట్నర్ మచ్చ సుధాకర్ మాట్లాడుతూ ఈ జిన్నింగ్ మిల్ ప్రారంభించడం ముఖ్య ఉద్దేశం రైతులకు మేలు చేయడమే రైతులు ఏ విధమైన సమస్యలను ఎదుర్కోకుండా వారు పండించిన పంటను సులభంగా ఎక్కువ రేటుకు అమ్ముకునే విధంగా ఈ జన్నింగ్ మిల్ పని చేస్తుందని అన్నారు అనంతరం హోం శాఖ మంత్రి మహమూద్ అలీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గార్లకు సూపర్ కాటన్ జిన్నింగ్ మిల్ యాజమాన్యం పూలమాలలు శాలువాలతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలాల ప్రజా ప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు ఉమ్మడి మండలాల ప్రజలు రైతులు తదితరులు పాల్గొన్నారు*