రైతు వేదికలోసీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ మధిర రూరల్సె

Published: Thursday September 22, 2022
ప్టెంబర్ 21 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు రైతు  వేదికలో సీఎం  రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు హాజరై సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారునియోజకవర్గ వ్యాప్తంగా కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధి నుండి పేదలకు అందిస్తున్నాం రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజయ్ కుమార్  సిఫారసు మేరకు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు  చోరవతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు నేరుగా లబ్ధిదారులు పంపిణీ చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు  రైతు వేదిక లో 40 మంది లబ్ధిదారులకు రూ.13,44,500/- లక్షల రూపాయల విలువ గల చెక్కులు పంపిణీ చేశారునిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి భరోసా గా మారిందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు  పేర్కొన్నారు. పట్టణ మండల పరిధిలో మొత్తం 40 మంది లబ్ధిదారులకు రూ.13,44,500- లక్షల రూపాయల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు నేరుగా పంపిణీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు  అందజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు అసలు సి ఆర్ ఎం ఈ అనేది ఉందని దానికి దరఖాస్తు చేసుకుంటే ఆర్దిక సహాయం అందుతుందని కూడా తెలియకుండా ఉందని కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిరుపేద కుటుంబాలను ముఖ్యమంత్రి కేసీఆర్  దృష్టిలో పెట్టుకొని  అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన అనంతరం సీఎం సహాయ నిధి కి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సీఎం సహాయ నిధి నుండి ఆర్దిక సహాయం అందిస్తున్నారని తెలిపారు అందులో భాగంగానే మధిర నియోజకవర్గంలో ఇప్పటి వరకు వేలాది మందికి కోట్ల రూపాయలను ఆర్దిక సహాయం గా అందించాం అన్నారు.

ఈ కార్యక్రమంలో  నియోజక వర్గ పార్టీ , పార్టీ ముఖ్య నాయకులు పట్టణ మండల అధ్యక్షులు రావూరి శ్రీను వెంకటేశ్వరావు మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వరావు ఆత్మ కమిటీ చైర్మన్ కోటేశ్వరావు టిఆర్ఎస్ నాయకులు వెంకన్న అరిగే శ్రీను మాధవి అప్పారావు, రాఘవ భాస్కర్ రెడ్డి జీవీ రెడ్డి కళ్యాణి కిరణ్ ఖాదర్ వాటి కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.