తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి తాండూర్ శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి పై బిజెపి నాయకులు

Published: Wednesday February 22, 2023

మురళి కృష్ణ గౌడ్ ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని తాండూర్ బి ఆర్ ఎస్ నాయకులు రాజు గౌడ్ నరసింహులు వెంకట్ రెడ్డి తదితరులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పేర్కొన్నారు జైలు నుండి విడుదల కాగానే ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరైన పద్ధతి కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాండూర్ ఎమ్మెల్యే రికమండేషన్ తోనే జిల్లా పరిషత్ చైర్మన్ అయిన సంగతి మర్చిపోయావా అని వారు ప్రశ్నించారు. తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వెనుక తిరిగి ఆర్చికంగా ఎదిగిన సంగతి మర్చిపోయావా అని వారు గుర్తు చేశారు. శివ స్వాములను దాడి చేయడానికి రెచ్చగొట్టినందుకే మురళి కృష్ణ గౌడ్ ను పోలీసు జైలుకు తీసుకెళ్లారని ఎమ్మెల్యేపై లేనిపోని ఆరోపణలు చేస్తూ పార్టీ పరుపు తీయడానికి ప్రయత్నిస్తున్నారని వారు ఆందోళన చెందారు ఇప్పటికైనా మురళి కృష్ణ గౌడ్ మారిపోయి రాజకీయ నాయకుడిగా శిక్షణ తీసుకొని మంచిగా ఉండాలని వారు కోరారు .