లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తల్లి పాలవారోత్సవాలు

Published: Thursday August 04, 2022

కొడిమ్యాల, ఆగస్టు 03 (ప్రజాపాలన ప్రతినిధి):
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో బుధవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తల్లి పాల వార్షికోత్సవాలను ఘనంగా  నిర్వహించడం జరిగింది.  ఈ సందర్భంగా గర్భిణీ  స్త్రీలకు పసుపు కుంకుమ పళ్లు పంపిణి చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో  లయన్స్ క్లబ్ అధ్యక్షులు బండా లింగారెడ్డి  సర్పంచ్ పెద్ది కవిత, కార్యదర్శి మనోహర్ రెడ్డి, సూపర్వైజర్
సుధారాణి  సిహెచ్ఓ వందన, వార్డు మెంబర్ శేఖర్ గౌడ్,కొత్త రమేష్ అంగనివాడి టీచర్లు ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.