సంక్షేమం కావాలంటే షర్మిలమ్మ రావాలి మధిర నియోజవర్గ

Published: Monday November 28, 2022
కోఆర్డినేటర్ రిటైర్డ్ సి ఐ మద్దెల ప్రసాదరావు*మధిర నవంబర్ 27 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు

తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం కావాలంటే షర్మిలమ్మ రావాలని  వైయస్సార్ తెలంగాణ పార్టీ  మధిర నియోజకవర్గ కోఆర్డినేటర్ రిటైర్డ్ సీఐ డాక్టర్ మద్దెల ప్రసాదరావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం నాటికి 3500 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా మధిర లో వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద కేక్ కట్ చేసి చేశారు. ఈ సందర్భంగా మద్దెల ప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్రంలో రాజన్న రాజ్యాన్ని స్థాపించడం కోసం వైఎస్ షర్మిల 2021 అక్టోబర్ 20న చేవెళ్ల వద్ద ప్రారంభమైన షర్మిల ప్రజాప్రస్థానం 222 రోజులకు చేరుకున్నదన్నారు. ఇప్పటివరకు 75 నియోజకవర్గాల్లో 3,500 కిలోమీటర్లు పూర్తయిందన్నారు. టిఆర్ఎస్ ఎనిమిదేళ్ళ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు.టిఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా వైఎస్ షర్మిల వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన 18 నెలల్లో ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేయటం జరిగిందన్నారు. తెలంగాణలో వైఎస్ షర్మిల చేపట్టిన ఉద్యమాలకు పాదయాత్రకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరవుతున్నారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రజల పక్షాన ప్రశ్నించే ప్రతిపక్షాలు లేకపోవడంతో వైయస్ షర్మిల ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో సంక్షేమం కావాలంటే షర్మిలమ్మ రావాలి అనే నినాదంతో షర్మిలమ్మ ఆదేశాల మేరకు ఇంటింటికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అనే కార్యక్రమాన్ని మధిర నియోజకవర్గంలో ముమ్మరంగా చేపట్టినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా మధిర నియోజకవర్గంలో గ్రామ కమిటీలను బూత్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో రైతులకు ఒకే సారి రుణమాఫీ చేశారని, పత్తి విత్తనాల ధరలను తగ్గించారని, ఫీజు రియంబర్స్మెంట్, 108, 104, ఉచిత విద్యుత్, ప్రాజెక్టుల నిర్మాణం అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వటం లాంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. అంతేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని, మైనార్టీలకు రిజర్వేషన్లు అందించారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత టిఆర్ఎస్ పాలనలో నిరుద్యోగ భృతి లేదని, రుణమాఫీ లేదని, ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం కావాలంటే షర్మిలమ్మ రావాలని నినాదాన్ని గ్రామ గ్రామాన మారుమ్రోగే విధంగా నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఇంటింటికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు మస్తాన్ పాషా వైఎస్ఆర్ టిపి మధిర ఎర్రుపాలెం బోనకల్ చింతకాని ముదిగొండ మండల అధ్యక్షులు ఐలూరి ఉమామహేశ్వర్ రెడ్డి వేమిరెడ్డి మల్లారెడ్డి షేక్ మౌలానా వాకా వీరారెడ్డి సామినేని రవి నియోజకవర్గ ప్రతినిధి వర్రే మరియ దాసు నాగ వేణు తదితరులు పాల్గొన్నారు.