ప్రభుత్వాసుపత్రికి చక్రాల కుర్చీలు పంపిణీ

Published: Friday March 05, 2021

మంచిర్యాల జిల్లా ప్రతినిధి, మార్చి04, ప్రజాపాలన: మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్  టీకాలు తీసుకోవడానికి వస్తున్న వృద్దుల సహాయార్థం మంచిర్యాల కు చెందిన మురికి   సుశీల దాసయ్య అనే వృద్ధ దంపతులు రెండు చక్రాల కుర్చీలు అందజేశారు. గురువారం  మంచిర్యాల లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ అరవింద్ , ఆర్ యం ఓ డాక్టర్ అనిల్ కుమార్ , సివిల్ సర్జన్ వైద్యురాలు శీలం కళావతి లకు వృద్ధ దంపతులు ఈ చక్రాల కుర్చీలను మున్సిపల్ చైర్ పర్సన్ పెంట రాజయ్య, వార్డు కౌన్సిలర్ మాదంశెట్టి సత్యనారాయణల ఆధ్వర్యంలో ఆసుపత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ పెంట రాజయ్య , ఆసుపత్రి సూపర్డెంట్ మాట్లాడుతూ, మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ రాకుండా ప్రభుత్వం నిర్వహిస్తున్న టీకా తీసుకునేందుకు వృద్ధులు ఉన్నారని , వీరు టీకా వేసే కేంద్రం పై అంతస్తులో ఉండటం వల్ల అక్కడికి వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యను గుర్తించి కౌన్సిలర్ మాదంశెట్టి సత్యనారాయణ సహకారంతో చక్రాల కుర్చీలు అందించడం ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. వీటి సాయంతో వృద్ధులను సునాయాసంగా పై అంతస్తుకు తీసుకు వెళ్ళవచ్చని చక్రాల కుర్చీలు అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.   ఈ కార్యక్రమంలో  నాయకులు  గొంగల శంకర్,  రావుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.