మంజూరైన పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలి వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల

Published: Saturday July 23, 2022
వికారాబాద్ బ్యూరో 22 జూలై ప్రజా పాలన :
ఇంజనీరింగ్ విభాగాల్లో మంజూరైన పనులను ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులతో జిల్లాలో మంజూరైన పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో పనులు గ్రౌండింగ్ అయి పూర్తికాని పనులు అదేవిధంగా పెండింగ్ కు గల కారణాలను తెలుసుకొని సంబంధిత ఇంజనీర్లు సమీక్షల నిర్వహించుకొని పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు.  తక్కువ వ్యయంతో కూడిన పనులను గుర్తించి సత్వరమే పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో వివిధ సామాజిక వర్గాలకు కేటాయించిన కమ్యూనిటీ భవనాలను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అదేవిధంగా గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరిస్తూనే భవనాల పనులను త్వరితగతిన చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఆర్ అండ్ బి , పంచాయతి రాజ్ రోడ్లు,  మున్సిపల్ రోడ్ల  మరమ్మత్తులతో పాటు రోడ్లను  బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. జిల్లాలో రూర్బన్ కింద చేపట్టిన పనులను త్వరలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని డి ఆర్ డి ఓ ను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా ఎంపీ లాడ్స్ కింద మంజూరైన పనులను శాఖల వారీగా జాబితాలను రూపొందించాలని ఇప్పటికే గ్రౌండింగ్ కానీ పనులు, పెండింగ్ లో ఉన్న పనులను నివేదికలను  పంపాలని కలెక్టర్ తెలిపారు. ఎంపీడీవోల పరిధిలో ఉన్న పనులను కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ పథకం కింద నిర్మాణాలు చేపడుతున్న వాటిపై కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే పనులు పూర్తి దశలో ఉన్న వాటిలో విద్యుత్తు,  నీటి సరఫరా, ప్లాస్టరింగ్ పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమం కింద జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులను  వంద శాతం చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. వంటగది,  ప్రహరీ గోడ , టాయిలెట్స్ సంబంధించి అంచనాలను  ఆన్ లైన్లో నిక్షిప్తం చేయడానికి వీలుగారెండు రోజులపాటు( శని,  ఆదివారాలు ) కలెక్టరేట్ లో కంప్యూటర్ ఆపరేటర్లను  హాజరు పరిచి వారం రోజుల్లోగా పనులు పూర్తి చేయాలన్నారు. 
ఈ సమీక్ష సమావేశంలో ఇంచార్జ్ డి ఆర్ ఓ విజయకుమారి,  డిఆర్డిఓ కృష్ణన్ , సిపిఓ నిరంజన్ రావు,  పంచాయత్ రాజ్ శ్రీనివాస్ రెడ్డి , ఆర్ అండ్ బి  ఇఇ లాల్ సింగ్, ఇరిగేషన్ ఇఇ సుందర్ లతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area