బోనాల ఉత్సవాల సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార

Published: Friday August 13, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి గ్రామం లోని శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ దేవాలయం, పోచమ్మ దేవాలయం, శ్రీ నల్ల పోచమ్మ దేవాలయం, పోచమ్మ దేవాలయాల్లో బోనాల ఉత్సవాల సందర్భంగా పలు ఆలయాల్లో ముఖ్య అతిధులుగా పాల్గొని అమ్మ వారికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు, రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవనేని రఘునందన్ రావు మాట్లాడుతూ బోనాల ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరికి అమ్మ వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియచేశారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ఒక ప్రతీక. అమ్మవారి దీవెనల కోసం బోనమెత్తే ప్రతి ఆడబిడ్డ హిందూ సంస్కృతికి నిజమైన వారసురాలు. అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలి. దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న నరేంద్రమోదీకి, ప్రజలకు ఉన్నత సేవలు అందించేలా మరింత శక్తిని ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నా అన్నారు. అనంతరం రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలపై అమ్మవారి కృప తప్పక ఉంటుందని పేర్కొన్నారు. కరోనా పూర్తిగా అంతమై ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారి వారిని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలపై అమ్మవారి కృప తప్పక ఉంటుందని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో డివిజన్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆలయ కమిటీలకు సూచించారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించకుండా భక్తులు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి పూజలు నిర్వహించాలని కోరారు. గచ్చిబౌలి డివిజన్ లో ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి ఎల్లప్పుడూ చేస్తానని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గజ్జల యోగానంద్, జిల్లా కార్యదర్శి మూల అనిల్ గౌడ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ ఐటీ సెల్ కన్వీనర్ రాఘవేంద్ర, వడెర సంఘం ప్రెసిడెంట్ అలకుంట శ్రీరామ్, సీనియర్ నాయకులు అంజన్ కుమార్, బిక్షపతి, ప్రభాకర్ మల్లేష్, నర్సింగ్ రావు , సతీష్ గౌడ్, ఈశ్వర్, మల్లేష్ యాదవ్, వెంకటేష్ యాదవ్, హరీష్ శంకర్ యాదవ్ ,కిషన్ గౌలి, ప్రభు, యశ్వంత్, రామ్, గొరక్, శ్యామ్, కిషన్ గౌలి, వెంకటేష్ యాదవ్, మన్నే రమేష్, నర్సింగ్ రావు, యాదయ్య, ప్రసాద్, బలరామ్, వసంత్, అనిల్, బాలకృష్ణ, నగేశ్, బిక్షపతి , ప్రసాద్ గుండప్పా, ఆయా దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.