స్మశానవాటిక ఆక్రమణను వెంటనే తొలగించాలి మండల రెవెన్యూ తహసిల్దార్ కు వినతిపత్రం అందజేసిన కు

Published: Wednesday April 12, 2023

బోనకల్, ఏప్రిల్ 11 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని కలకోట గ్రామంలో మాలపల్లి కులానికి చెందిన స్మశాన వాటికను కొంతమంది మా పట్టా భూమి అని గతం లో మాలపల్లి వారికి తెలియకుండా పట్టా చేయించుకుని స్మశాన వాటిక భూమిని ఆక్రమించుకున్నారు. గత 1850 నుంచి మాలపల్లి కులానికి చెందిన వారు ఎవరైనా చనిపోతే ఇక్కడే భూస్థాపితం చేయడం జరుగుతుంది.. కొంతమంది రాజకీయ నాయకులను ఆసరాగా చేసుకుని భూమిని ఆక్రమించుకున్నారు. సమాధులను జెసిబి లతో తొలగించి చదును చేయించి హద్దులు వేసుకొని ఆక్రమించుకోవడం జరిగింది. ఈ విషయమై మాలపల్లి కి చెందిన కొంతమంది కుల పెద్దలకు సమక్షంలో కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అనంతరం మంగళవారం బైక్ ట్రాక్టర్లతో ర్యాలీగా బయలుదేరి బోనకల్ మండల రెవెన్యూ కార్యాలయానికి చేరుకొని మండల రెవెన్యూ డిప్యూటీ తాసిల్దార్ ఎస్. శ్వేత కుల పెద్దలు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తక్షణమే దీనిపై, పూర్తి వివరాలు తెలుసుకొని న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు అబ్బూరి ప్రసాదరావు, యామాల మిల్కీ రాజు, జంగం ప్రసాదరావు, ఆది ధోరణిస్, కోమెరా యోహాను, అబ్బూరి బాబు, బండి ప్రభాకర్, పెరమాలపల్లి బాబు, వేము యేసు ,ఆది వెంకటేశ్వర్లు ,కటికల కృష్ణ ,చవల రాములు, బందెల ముత్తయ్య, సుంకర వెంగళరావు, కుల పెద్దలు యూత్ తదితరులు పాల్గొన్నారు.