*జిల్లాలో ఘనంగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు*

Published: Saturday April 15, 2023
మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 14, ప్రజాపాలన : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని  బాబు జగ్జీవన్ రామ్ సాయికుంట యువత  రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిప్పకుర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి,భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అంబేద్కర్ దళితులకు మాత్రమే నాయకుడు కాదని భారతావని ప్రజల అందరికీ  మార్గదర్శిని, ప్రజలందరూ యువత స్త్రీలు కుల మతాలకతీతంగా సమ సమాజాన్ని నిర్మించుకోవాలని అన్నారు. రాజ్యాంగం ప్రతి మనిషికి రక్ష అని,అలాంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి పై ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో చిప్పకుర్తి రాజు,సురిమిల్ల ప్రదీప్,ఆవునూరి ప్రసాద్,ఆవునూరి రమేష్,ఆర్ణకొండ నరేష్,గోమాస తిరుపతి,ఆవునూరి ప్రమోద్,చిప్పకుర్తి మహేందర్,పవన్ కళ్యాణ్,శ్రీనాథ్,అజయ్, సాయి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో మంచిర్యాల ఐబి చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహానికి   పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు.    మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాలలో గల శాలివాహన పవర్ ప్లాంట్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన పవర్ ప్లాంట్ కార్మికులు.
పట్టణంలోని ఐబీ చౌరస్తా లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద  ఘన నివాళులర్పించిన  డి ఎస్ పి దళిత శక్తి ప్రోగ్రాం నాయకులు. మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ లో భారత రాజ్యాంగ నిర్మాత డా బి ఆర్ అంబేద్కర్ జయంతిని   
సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దుంపల రంజిత్ కుమార్ ఘనంగా నిర్వహించారు.
దళిత జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో 
అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించి అనంతరం ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు.