రాయితీ రుణాల దరఖాస్తు గడువు పొడిగింపు.

Published: Thursday March 18, 2021
జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నారాయణరెడ్డి
మంచిర్యాల జిల్లా ప్రతినిధి, మార్చి 17, ప్రజాపాలన : జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంత గిరిజన అభ్యర్థులకు కార్యాచరణ ప్రణాళిక క్రింద 2020-21 ఆర్థిక నంవత్సరానికి గాను రాయితీ నిధులు మంజూరు చేయడం జరిగిందని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నారాయణరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు 176 యూనిట్లకు గాను 10 కోట్ల 7 లక్షల రూపాయల రాయితీ నిధులు కేటాయించడం జరిగిందని ఈ యూనిట్లను ఆయా మండలాల, మున్సిపాలిటీల వారీగా కేటాయించడం జరుగుతుందని, ఆసక్తి గల గిరిజన అభ్యర్థుల కోసం గడువు తేదీని ఈ నెల 31 వరకు పొడిగించినట్లు, అభ్యర్థులు నంబంధిత మండల ప్రజా పరిషత్ అధికారి/ మున్సిపల్ కమిషనర్ సంప్రదించి tsobmms.cgg.gov.in వెబ్ సైట్ నందు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.