కోవిడ్ వాక్సినేషన్ సెంటర్ సందర్శించిన జిల్లా పి.ఓ.డి.టీ

Published: Tuesday April 20, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిదిలోని వెల్వర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా పి.ఓ.డి.టి. డాక్టర్ శేపూరి ప్రశాంత్ సందర్శించారు. వెల్వర్తి ఉపకేంద్రం పరిధిలోని అన్ని గ్రామాలలో కోవిడ్ వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కొవిడ్ టీకాల వల్ల ఎటువంటి దుష్పరిణామాలు ఉండవన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా కోవిడ్ టీకాలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, బయటికి వెళ్ళినప్పుడు తప్పకుండా మాస్కు ధరించాల న్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ సంతోష్ రెడ్డి, డాక్టర్ కిరణ్ కుమార్,డాక్టర్ జ్యోతి, సి.హెచ్.ఓ. మురళీధర్, హెచ్.ఈ.ఓ.గణేష్, ఆరోగ్యపర్యవేక్షకులు నాశబోయిన నరసింహ, హెల్త్ అసిస్టెంట్లు, ఎం.జానకి రాములు, ఏ సాలమ్మ, కృష్ణవేణి, ఆషా కార్యకర్తలు లక్ష్మీ, నమ్రత, లక్ష్మీ నరసమ్మ, జ్యోతి, రేష్మ పాల్గొన్నారు.