కరోనా కట్టడికి గ్రామస్తులు సహకరించాలి సర్పంచ్ మూల్పూరి స్వప్న

Published: Saturday January 22, 2022
ఎర్రుపాలెం జనవరి 21 ప్రజాపాలన ప్రతినిధి: రాష్ట్రంలో ప్రస్తుతం విజృంభిస్తున్న కోవిడ్ థర్డ్ వెవ్ విషయంలో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని గ్రామ సర్పంచ్ స్వప్న, ఎంపీటీసీ శైలజ కోరారు. గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కరోనా కట్టడి పై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 11న నుండి ప్రారంభమైన ఓమి క్రాన్ వేవ్ ఇంకా కొంతకాలం కొనసాగుతోందని డాక్టర్లు చెబుతున్నారని, మనం జాగ్రత్తగా ఉంటే డెల్టాను, ఒమిక్రన్లను అధిగమించవచ్చునని అన్నారు. గత వారం రోజులుగా మండలంలోని అనేక గ్రామాల్లో కరోనా విజృంభిస్తుంది అని, ప్రజలు అత్యవసర పనులకు మాత్రమే బయటకు రావాలని అన్నారు. గ్రామస్తులు గుంపులుగుంపులుగా ఒకచోట చేరకుండా ఉండాలన్నారు. తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు. గ్రామంలో ఎవరికైనా జ్వరం, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే బనిగండ్లపాడు పీహెచ్సీకి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని అన్నారు. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి బయట తిరగకుండా ఇంట్లోనే ఉండాలని అన్నారు. గ్రామస్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించి, శానిటీజర్ ను ఉపయోగించాలి అన్నారు. బయటికి వెళ్లి రాగానే శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలి అన్నారు. కరోనా నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. గ్రామస్తులు పంచాయతీ వారు సూచించిన విధంగా మాస్కు ధరించి, శానిటైజర్ చేసుకుంటూ, భౌతిక దూరాన్ని పాటిస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వప్న, ఎంపీటీసీ శైలజ, గ్రామ కార్యదర్శి వి సురేష్ బాబు, ఎర్రుపాలెం సొసైటీ మూల్పూరి శ్రీనివాస రావు, ఉప సర్పంచ్ ఉయ్యూరు మల్లిక, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.