టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా గోల్కొండ పిఎస్ కు బయల్దేరిన రాగిడి లక్ష

Published: Friday February 18, 2022
మేడిపల్లి, ఫిబ్రవరి 17 (ప్రజాపాలన ప్రతినిధి) : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా గోల్కొండ పోలీస్ స్టేషన్ కు బయల్దేరిన ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డిని మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ అక్రమ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తన నీడను చూసి తానే భయపడుతున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వానికి  రోజులు దగ్గరపడ్డాయని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలపై పోరాడడానికి కాంగ్రెస్ పార్టీ  మరింత ఉదృతంగా పోరాటం చేస్తోందన్నారు.  దోపిడి చర నుండి తెలంగాణ ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పోలీసు వ్యవస్థను తన కబంధ హస్తాల్లో పెట్టుకొని అధికారాన్ని శాసిస్తూ ప్రతిపక్షాన్ని ఖూనీ చేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అరెస్ట్ అయిన వారిలో యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కారిపే సంతోష్ కుమార్, యూత్ కాంగ్రెస్ సెక్రటరీ సాయి బాబా, కారిపే మల్లికార్జున్, గుప్త, సురేష్ ఉన్నారు.