ఘనంగా చట్ పూజ వేడుకలు మేడిపల్లి, నవంబర్ 1 (ప్రజాపాలన ప్రతినిధి)

Published: Wednesday November 02, 2022
ఉప్పల్, రామంతాపూర్ పరిసర ప్రాంతాల్లో నివాసముండే బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, మరియు జార్ఖండ్ వాసులు చట్ పూజ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఉప్పల్ నల్లచెరువు బతుకమ్మ ఘాటు, రామంతాపూర్ చిన్న చెరువు వద్ద మహిళలు ఆదివారం సూర్య అస్తమయంలో పూజ మరియు సోమవారం ఉదయం సూర్య భగవానునికి పూజ కార్యక్రమాలను నిర్వహించారు. రామంతాపూర్ చిన్న చెరువు ప్రాంగణంలో నిర్వహించిన చట్ పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్  బండారు శ్రీవాణి వెంకట్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహకులు రామ్ ప్రకాష్ గుప్తా, భగవాన్ సింగ్, మంజునాథ్ గుప్తా, సురేష్ సింగ్, అజయ్ శర్మ, కమలేష్ పాండే, రాజీవ్ కుమార్, రాజేష్ శర్మ, ఉప్పల్ బీహార్ అసోసియేషన్ సభ్యులు ప్రభాస్ కుమార్, రవి శంకర్ సింగ్, దిలీప్ కుమార్, ఉత్తమ్ కుమార్ యాదవ్, శేఖర్ సింగ్, సోను, సుప్రీత్ సింగ్, రియాసింగ్, మౌనిక సింగ్ తదితరులు పాల్గొన్నారు.