డయల్ యువర్ ఆర్టీసీ డిఎం కార్యక్రమానికి ప్రయాణికుల నుంచి విశేష స్పందన

Published: Saturday July 30, 2022

మధిర జూలై 29 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలోమధిర టి ఎస్ ఆర్ టి సిడిపో నందు జరిగిన డయల్ యువర్ డి. యం. కార్యక్రమం నందు ప్రయాణికులు మరియు పరిసర ప్రాంత ప్రజల నుండి విశేష స్పందన వచ్చినది. ఈ కార్యక్రమం లో అధిక శాతం మంది ప్రజలు మధిర నుండి నందిగామ కు అదనపు ట్రిప్పులు నడపమని కోరినారు. దానికి డిపో మేనేజర్  ప్రయాణికుల అవసరానికి అనువైన సమయంలో అదనపు ట్రిప్పులు ఏర్పాటు చేస్తామనని తెలియజేసారు.శ్రీనివాస కుర్నవల్లి  బస్ ను ఏర్పాటు చేయమని కోరగా గతంలో ఆ సర్వీస్ ను నడపడం జరిగిందని ఆదాయం సరిగా రాని కారణంగా రద్దు పరచడం జరిగింది అని తెలియజేసారు. అంబేద్కర్ సెంటర్ నందు బస్ టైమింగ్స్ బోర్డు ఏర్పాటు చేయమని శ్రీ జి. రామకృష్ణ కోరగా, త్వరలో ఏర్పాటు చేస్తామని తెలియజేసారు.మధిర నుండి మియాపూర్ కు బస్ సర్వీస్ ఏర్పాటు చేయమని శ్రీ పల్లవ కుమార్ కోరగా పై అధికారులతో సమీక్షించి బస్ ఏర్పాటుకు పరిశీలన చేస్తామని తెలియజేసారు.ఈ కార్యక్రమం నందు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేస్తూ  మధిర ఆర్టీసీ డిపో అభివృద్ధికి ప్రయాణికులు తమ వంతు సహకారం అందిస్తూ అందరూ ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణించేలాగున తమ వంతు సహకారం అందిచవలసినదిగా మధిర డిపో మేనేజర్ శ్రీ యస్. దేవదానం కోరినారు.