మధిర మున్సిపాలిటీ పరిధిలో వీధుల్లో బ్లీచింగ్

Published: Tuesday May 04, 2021
 మధిర, మే 3, ప్రజాపాలన ప్రతినిధి : కరోనా సెకండ్ వేవ్ బాగా విజ్రంబిస్తున్న ఈ తరుణంలో  తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖా మాత్యులు కేటీర్ గారు "ప్రతి మున్సిపాలిటీలోనూ బ్లీచింగ్ మరియు శానిటేషన్ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉండాలి "అనే పిలుపు మేరకు మధిర మున్సిపాలిటీ పరిధిలో మడుపల్లి గ్రామంలో బ్లీచింగ్ చల్లించడం జరిగింది. మధిర లో కూడా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉండటంతో అటు పాలక వర్గానికి ఇటు మున్సిపల్ సిబ్బందికి ప్రతి రోజు సలహాలు సూచనలు ఇస్తున్న మధిర అభివృద్ధి ప్రదాత ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారి మార్గదర్శకత్వంలో, మున్సిపల్ చైర్-పర్సన్ మొండితోక లత జయకర్ కమీషనర్ అంబటి రమా దేవి గార్ల నేతృత్వంలో  మడుపల్లి  గ్రామంలో 6వ వార్డు కౌన్సిలర్ తొగరు వరలక్ష్మి ఓంకార్ మరియు 7వ వార్డు కౌన్సిలర్ మేడికొండ కళ్యాణి కిరణ్  ఆధ్వర్యంలో వీధులన్నిటియందు బ్లీచింగ్ చల్లించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తొగరు ఓంకార్, తెరాస నాయకులు మేడికొండ కిరణ్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.