మాటూరు హైస్కూల్ విద్యార్థులకు సోలార్ లాంప్ల పంపిణీ

Published: Tuesday October 19, 2021

మధిర, అక్టోబర్ 18, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలంలోని మాటూరు ఉన్నత పాఠశాలకు చెందిన గణిత ఉపాధ్యాయుడు శ్రీ మేడేపల్లి శ్రీనివాసరావు చొరవతో TS REDCO తెలంగాణ రాష్ట్ర పునరుద్దరణ ఇందన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ ఆధ్వర్యంలో DRDA ఖమ్మం నందు రు.460 విలువైన సోలార్ లాంప్ కేవలం రు.70కే పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న విషయం తెలుసుకొని విద్యార్థులను ప్రోత్సహించి 80 మందికి సోలార్ లాంప్లు స్వంతఖర్చులతో ఖమ్మం నుంచి తీసుకొని వచ్చి మండల విద్యాశాఖాధికారి వై.ప్రభాకర్ చేతులమీదుగా అందించటం జరిగింది. ఈ సందర్బంగా ఎంఇఒ ప్రభాకర్ మాట్లాడుతూ సోలార్ లాంప్ వాడకం పెరిగినట్లయితే మనం అందరం విద్యుత్ పొదుపు చేసిన వారమవుతాం అని పేర్కొంటూ ఖమ్మం నుంచి విద్యార్థుల కోసం సోలార్ లాంప్ లు తీసుకొని వచ్చిన MSR కి ప్రత్యేక అభినందనలు తెలియజేసారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దీవి సాయి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ భవిష్యత్ తరాల కోసం అందరం సోలార్ వినియోగం పట్ల అవగాహన పెంచుకొని ఉపయోగించేలా చూడాలని కోరారు. మిగిలిన విద్యార్థులు కూడా ముందుకు వచ్చి సోలార్ లాంప్ లు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అడపాల వెంకటేశ్వర్లు, విద్యాకమిటి చైర్మన్ మేడిశెట్టి రామకృష్ణారావు, పాఠశాల ఉపాధ్యాయులు సంక్రాంతి శ్రీనివాసరావు, కొలగాని ప్రసాదరావు, కంచిపోగు ఆదాము, రెంటపల్లి భాగ్య శ్రీనివాసరావు, వేము రాములు, మహ్మద్ చాంద్ బేగం, గుంటుపల్లి రమాదేవి, వేములపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.