తలసేమియా బాధితులకోసం నలుగురు మాటూర్ హైస్కూల్ ఉపాధ్యాయుల రక్తదానం

Published: Monday September 06, 2021
మధిర, సెప్టెంబర్ 05, ప్రజాపాలన ప్రతినిధి : తలసేమియా బాధితుల కోసం స్విమ్మర్స్ అసోసియేషన్, మధిర వారిచే ఈ రోజు టీవీఎం పాఠశాలనందు నిర్వహించిన రక్తదాన శిబిరంలో నలుగురు మాటూర్ హైస్కూల్ ఉపాధ్యాయులు రక్తదానం చేయడం అభినందనీయం అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ దీవి సాయికృష్ణమా చార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా ఉపాధ్యాయ దినోత్సవం రోజునే మా పాఠశాల ఉపాధ్యాయులు సంక్రాతి శ్రీనివాసరావు, కొలగాని ప్రసాదరావు, మేడేపల్లి శ్రీనివాసరావు, వేములపల్లి సత్యనారాయణ లతో పాటు కొలగాని ప్రసాదరావు కుమారుడు కొలగాని పవన్ సాయిమెదటిసారి రక్తదానం చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలవడం చాలా గొప్ప విషయంగా పేర్కొన్నారు. విద్యార్థులకు చక్కని చదువు అందిస్తూ స్టేట్ ర్యాంక్ లు సైతం సాధించడమే కాకుండా సామాజిక కార్యక్రమాలలో సైతం ముందు ఉంటున్న మాటూర్ ఉపాధ్యాయుల సేవలను పలువురు కొనియాడారు.