మాటూర్ హైస్కూల్ లో ఘనంగా రైతు బందు సంబరాలు

Published: Friday January 07, 2022
మధిర జనవరి 6 ప్రజా పాలన ప్రతినిధి : మధిర మండలం మాటూరు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు సంబరాల వేడుకలలో భాగంగా మాటూరు హైస్కూల్ లోని 8,9,10వ తరగతి విద్యార్థులకు రైతు బంధు పథకం అమలు, తెలంగాణ రాష్ట్రం వచ్చాక వ్యవసాయంలో వచ్చినటువంటి మార్పులపై వ్యాసరచన, డిబేట్ పోటీలను నిర్వహించి బహుమతులు అందించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ దీవి సాయికృష్ణమా చార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించదానికి విచ్చేసినటువంటి మాటూరు AEO దోమాల నిఖిత మాట్లాడుతూ గతంలో కంటే ఇపుడు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వ్యవసాయం చేయడం సులువుగా మారింది. కావున రైతులందరు కొత్త పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడి సంధించవలసిందిగా సూచించారు.ఈ కార్యక్రమం ఎంపీటీసీ అడపాల వెంకటేశ్వర్లు, మేడిశెట్టి నాగేశ్వరావు, పూల వెంకయ్య, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.