సత్యనారాయణ నేటి తరం నేతలకు ఆదర్శం : ఎమ్మెల్యే కందాల

Published: Monday September 20, 2021
పాలేరు, సెప్టెంబర్బి 19, ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి. మండలం పైనం పల్లి నేటి తరం నాయకులకు దివంగత నేత నాగుబండి సత్యనారాయణ ఆదర్శమని పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి, అన్నారు. ఆదివారం నేలకొండపల్లి మండలంలోని పైనంపల్లి గ్రామంలో నాగుబండి సత్యనారాయణ స్మారక మందిరం, కాంస్య విగ్రహాన్ని కందాళ ఉపేందర్ రెడ్డి ఆవిస్కరించారు. ఈ సందర్భంగా డిసిఎంస్ డైరెక్టర్, నాగుబండి సత్యనారాయణ తనయుడు నాగుబండి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో కందాళ... మాట్లాడుతూ దివంగ‌త నాగుబండి సత్యనారాయణ నిరంత‌రం ప్ర‌జా సేవ‌లోనే గ‌డిపార‌ని ఉపేందర్ రెడ్డి కొనియాడారు. ఆయ‌న ఆత్మీయ‌త‌ను ఎప్ప‌టికీ మ‌రువ‌లేమన్నారు. ఆయ‌న ప్ర‌జ‌ల హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోతార‌ని కందాళ అన్నారు. పేదల పక్షపాతైన నాగుబండి సత్యనారాయణ ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్చిన బాధ్యత తన తనయుడు శ్రీనివాసరావు పై ఉందన్నారు. తొలుత గ్రామంలోని శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, డిసిఎంస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, ఎంపిపిలు వజ్జా రమ్య, బెల్లం ఉమ, జడ్పీ వైస్ చైర్ పర్సన్  మరికంటి ధనలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్తియా సెట్రాం నాయక్, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఉన్నం బ్రహ్మయ్య, చాట్ల పరుశురాం, పైనంపల్లి ఎంపిటిసి సభ్యులు ఉసిరికాయల లక్ష్మయ్య, సర్పంచ్ కోండ్రు విజయలక్ష్మి నాయకులు నెల్లూరి లీలా ప్రసాద్, వజ్జా శ్రీనివాసరావు, ఆహ్వాన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు