వైయస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైయస్ షర్మిల 48వ పుట్టినరోజు వేడుకలు....

Published: Saturday December 18, 2021
ఎర్రుపాలెం డిసెంబర్ 17 ప్రజాపాలన ప్రతినిధి: మండలంలోని తెలంగాణ వైయస్సార్ పార్టీ కార్యాలయంలో రాజన్న ముద్దుల తనయ వైయస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైయస్ షర్మిలమ్మ 48వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రుపాలెం మండల అధ్యక్షులు వేమిరెడ్డి మల్లరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు రమణారెడ్డి అధ్యక్షతన ఎర్రుపాలెం మండల పార్టీ ఆఫీసు నందు వైయస్ షర్మిలమ్మ జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గూడూరు రమణారెడ్డి మాట్లాడుతూ ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జగనన్న చేయూత ట్రస్ట్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ మరియు మండల మైనార్టీ నాయకులు షేక్ ఇస్మాయిల్, మండల ఎస్సీసెల్ నాయకులు దేవరకొండ భూషణం, బీసీ నాయకులు మహేష్, గౌడ నాయకుడు గోపాల స్వామి గౌడ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ సౌరీల్ బాబు పాల్గొన్నారు.