ప్రియాంకా గాంధీ అక్రమ అరెస్ట్ నూ ఖండిస్తున్నా : మధిర మండల కాంగ్రెస్ కమిటీ

Published: Tuesday October 05, 2021
మధిర, అక్టోబర్ 4, ప్రజాపాలన ప్రతినిధి : ఉత్తరప్రదేశ్ లో సాగు చట్టాలపై నిరసన తెలుపుతున్న రైతులపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా రైతులపై కారును ఎక్కించటంవలన 4 రైతులు మరణించడం జరిగింది. మరికొంతమంది గాయాల పాలయ్యారు. ఇటువంటి దుర్గటనలకు పాల్పడిన BJP వైఖరికి నిరసనగా మరియు రైతులను పరామర్శించడానికి వెళ్తున్న శ్రీమతి ప్రియాంకా గాంధీనీ అరెస్ట్ ఖండిస్తూతూ మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించినారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్అధ్యక్షులుచావా వేణు మాట్లాడుతూ, 10 నెలలుగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులకు నష్టం జరిగే నల్ల చట్టాలను రద్దు చెయ్యాలని నిన్న అనగా 03/10/2021న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రైతులు శాంతియుతంగా ప్రదర్శన చేస్తుండగా కేంద్రమంత్రి కుమారుడు రైతులపై కారును ఎక్కించి 4 రైతుల మరణానికి కారకుడు అయ్యాడు. మరికొందరు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు మృతుల కుటుంబాలను పరామర్శించించి వారికి ధైర్యం చెప్పడానికి వెళ్తుండగా మార్గమధ్యలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శ్రీమతి ప్రియాంక గాంధీ అక్రమంగా అరెస్టు  చేయడం హేయమైన చర్య అని, రైతుల మృతికి కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని మరొకచోట ఇలాంటి సంఘటనలు జరగకుండా రైతుల సాగు చట్టాలను రద్దు చేసి  10 నెలలుగా రైతులు చేస్తున్న ఉద్యమాన్ని విరమింప చేయాలని కాంగ్రెస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాం, ఈ కార్యక్రమంలో. కాంగ్రెస్ పార్టీ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు. దారా బాలరాజు మధిర మున్సిపల్ కౌన్సిలర్లు కోన దాని కుమార్ మును కోటి వెంకటేశ్వర్లు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు. తూమాటి నవీన్ రెడ్డి. మండల కిసాన్ సెల్ అధ్యక్షులు దుంప వెంకటేశ్వర్ రెడ్డి ST సెల్ మండల అధ్యక్షులు తేజావత్ బాలునాయక్ పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే జాంగిర్. మండల బిసి సెల్ అధ్యక్షులు చిలువేరు బుచ్చి రామయ్య పట్టణ ఐఎన్టియుసి అధ్యక్షులు ఎస్ కే బాజీ మండల నాయకులు కర్నాటి రామారావు సూర్యదేవర కోటేశ్వర రావు. సేవాదళ్ మండల అధ్యక్షులు ఆదూరి శ్రీనివాస్ గాంధీ పదం మండల అధ్యక్షులు బోడేపూడి గోపీనాథ్ ఆదిమూలం శ్రీనివాస్ బాణావతి రమణ నాయక్, గద్దల విజయ్. తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు