ధరణి పోర్టల్ రద్దు చేయాలి పొడుభూములకు పట్టా పాసుబుక్కులు ఇవ్వాలి --టీపీసీసీ సభ్యులు మునుగోడ

Published: Thursday December 01, 2022
చౌటుప్పల్ నవంబర్ 30 (ప్రజా పాలన ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ ద్వారా అమాయక రైతులను మోసం చేస్తుందని టిపిసిసి సభ్యులు మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చల్లమల్ల కృష్ణారెడ్డి అన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని ఆర్డిఓ ఆఫీస్ ఎదురుగా టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు డిసిసి కార్యదర్శి సూరి నరసింహ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న చెల్లమల్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రైతుల పాలిట శాపంగా మారాయని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే భూములు పంచడం జరిగిందని, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల దగ్గర నుండి భూములు లాక్కొని తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తుందని మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు కమిషన్లకు అలవాటు పడ్డ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నా పోడు భూములను పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందు లకు గురి చేస్తుందని అన్నారు. తక్షణమే పోడు భూములకు పట్టా పాస్బుక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజులలో రైతుల పక్షాన పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యురాలు పాల్వాయి స్రవంతి, జిల్లా నాయకులు బుజ్జ సంధ్యారెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు బోయ రామచంద్రం, ముప్పిడి సైదులు, మల్కాపురం నరసింహ, బోయ దేవేందర్, లందగిరి భీమయ్య, ఊదరి శ్యామ్, చెరుకు లింగస్వామి, శామకూర రాజయ్య, కళ్లెం దయాకర్, ఊదరి నరసింహ, సుక్క కృష్ణ, సత్యం, ఊదరి మహేష్, ఊదరి శ్రీనివాస్, ఊదరి మహేష్, ఊదరి రాజు, తదితర నాయకులు పాల్గొన్నారు.