చాకలి ఐలమ్మ 126వ జయంతి వేడుకలు

Published: Monday September 27, 2021
బాలాపూర్, సెప్టెంబర్ 26, ప్రజాపాలన ప్రతినిధి : జమీందారులకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ వీర వనిత చిట్యాల ఐలమ్మ అని అర్కాల టిఆర్ఎస్ నూతన అధ్యక్షులు కామేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో చిట్యాల చాకలి ఐలమ్మ 126వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ అధ్యక్షులు మాట్లాడుతూ.... భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం అహర్నిశలు పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మనీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, పార్టీ తెరాస నాయకులు దీప్లాల్ చౌహాన్, యూత్ అధ్యక్షులు నాగరాజు, కార్పొరేటర్లు గజ్జల రమచందర్, మదరి రమేష్, జిల్లెలగుడ రజక సంఘం అధ్యక్షులు బిక్షపతి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, ఉపాధ్యక్షులు శంకర్, ఇతర నాయకులు జంగయ్య, వెంకటేష్  తదితరులు పాల్గొన్నారు.