కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ,డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని మణుగూరులో కదం తొక్కిన

Published: Wednesday November 02, 2022
మణుగూరు (ప్రజా పాలన.)
కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న నిత్యవసర వస్తువులు వంటగ్యాస్ ,ధరలకు వ్యతిరేకంగా మణుగూరు పట్టణంలో బి ఆర్ఎస్ పార్టీ మహిళా నాయకుల కార్యకర్తల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయము నుంచి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ సెంటర్ వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శాసనసభ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు రేగాకాంతారావు  ఆదేశాల మేరకు ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండలం జడ్పీటీసీ శ్రీమతి కామిరెడ్డి శ్రీలత  మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న నిత్యవసర వస్తువులు వంటగ్యాసులు ,పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్  చేశారు. వంట గ్యాస్, నిత్యవసర వస్తువులు డీజిల్, పెట్రోల్ ధరలను బిజెపి పార్టీ పెంచుతుందని విమర్శించారు .పెంచిన వంట గ్యాస్  ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు , రాష్ట్ర మహిళలను గృహినిలను రోడ్డున పడేసిన ఘనత, రోడ్డు మీదకు తెచ్చిన ఘనత కేంద్ర బిజెపి సర్కార్ దేనాని ఆమె  ఎద్దేవా  చేశారు. .రాష్ట్ర ప్రజలను రోడ్డుపైకి తెచ్చిన ఘనత మోడీ సర్కార్ కి దక్కుతుందన  ఆమె అన్నారు., దేశాన్ని కాపాడే శక్తి, ముందుకి నడిపించే శక్తి ,నేడు సీఎం కేసీఆర్ కి మాత్రమే ఉందని సీఎం కేసీఆర్  తెలంగాణ రాష్ట్రంలో మహిలల కోసం  చేపడుతున్న అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని  నిరసనలు చేపట్టారు .కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న ధరలకు మధ్యతరగతి కుటుంబాలు చాలా కష్టపడుతున్నాయని వివరించారు .ఈ కార్యక్రమంలో, అశ్వాపురం జడ్పిటిసి సూది రెడ్డి సులక్షణ, బూర్గంపాడు మండలం  జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత  బూర్గంపాడు మండలం మహిళ అధ్యక్షురాలు లలిత , మాజీ ఎంపిటిసి దాసరి వెంకటరమణ , మహిళల నాయకులు, మహిళ కార్యకర్తలు, మహిళ మండలి విభాగము, తాడిపర్తి సుధారాణి , స్థానిక మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.