విప్పలమడక గ్రామంలో హిందూ స్మశాన వాటిక పనులు చేపట్టాలి వార్డు సభ్యులు ఫిర్యాదు

Published: Tuesday February 15, 2022
వైరా మండలం విప్పలమడక గ్రామంలో హిందూ శ్మశాన వాటికలో వైకుంఠ ధామం నిర్మాణ పనులు చేపట్టాలని గ్రామంలోని వార్డు సభ్యులు స్థానికులు ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు గ్రామంలో హిందూ స్మశాన వాటిక స్థలంలో మెరుగైన వసతులు లేక స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని ప్రభుత్వం మంజూరు చేసిన వైకుంఠధామాన్ని ఇతర ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల తీర్మానం లేకుండా సర్పంచ్ తుమ్మల జాన్ పాపయ్య ఇష్టానుసారంగా వ్యవహరించి నిర్మించారని స్థానిక వార్డు సభ్యులు ఆరోపించారు ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుని గ్రామ పంచాయతీలో జరుగుతోన్న సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎం రమేష్ శ్రీకాంత్ నరేష్ కృష్ణవేణి గ్రామస్తులు ముత్తమాల జయరాజు పోతినేని మాలకొండయ్య రాంబాబు వెంకటేశ్వర్లు చంద్రశేఖర్ ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు