చట్టం ముందు అందరు సమానులే... తప్పులు చేస్తే శిక్షలు తప్పవు

Published: Wednesday October 06, 2021
సారంగాపూర్, అక్టోబర్ 05, ప్రజాపాలన ప్రతినిధి : సారంగాపూర్ మాండల్ లక్ష్మీదేవిపల్లి గ్రామంలో జ్ఙాన విజ్ఞాన సదస్సు నిర్వహించారు. చట్టం దృష్టిలో అందరు సమానులే తప్పులు చేస్తే శిక్షలు తప్పవని ప్రముఖ న్యాయవాదులు జున్ను రాజేందర్ ఐలయ్య సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలు మాదక ద్రవ్యాలు మద్యం మత్తులో యువత చెడిపోవడం చిన్న పిల్లలపై అత్యాచారాలు భార్యాభర్తల మధ్య గొడవలు భూమి తగాదాలు తదితర  అంశాలపై తప్పులు చేసి శిక్షలకు గురి కావద్దని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాంపర్తి లక్ష్మి ఎంపీటీసీ ఏలేటి మమత ధర్మనాయక్ తండ సర్పంచ్ భూక్య సంతోష్ సారంగాపూర్ ప్యాక్స్ ఛైర్మన్ ఏలేటి నర్సింహారెడ్డి సఖి కో-ఆర్డినేటర్ గౌతమి ఉప సర్పంచ్ కంచర్ల రాజేశ్వరి పంచాయతీ కార్యదర్శి శివపాల్ సింగ్ ఏఎస్ఐ లక్ష్మీనారాయణ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.