ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 20ప్రజాపాలన ప్రతినిధి *ఈనెల 21 ,22 ,23 తేదీల్లో సిద్దిపేట జిల్లాలో జరిగ

Published: Wednesday December 21, 2022
సిఐటియు జిల్లా నాయకులు ఎస్.చందనాయక్ మాట్లాడుతూ ఈనెల 21, 22, 23 తేదీలలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగే సిఐటియు 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. సిఐటియు కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహిస్తూ దేశంలోని అతిపెద్ద కార్మిక సంఘముగా ఎదిగిందని అన్నారు. అంగన్వాడీ టీచర్లు ఆయలు ఆశ వర్కర్లు మున్సిపల్ కార్మికులు గ్రామపంచాయతీ కార్మికులు వీఆర్ఏలు భవన నిర్మాణం కార్మికులు ఇతర రంగాల్లోని పనిచేస్తున్న కార్మికుల హక్కుల కోసం కనీస వేతనాలు అమలు చేయాలని అనేక పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్న సిఐటియు సంఘం బలోపేతం ఉంటేనే సమస్యలు పరిష్కారం  అవుతాదని అన్నారు. అందుకు అనుగుణంగా కార్మిక రంగంలో ఉన్న కార్మికులు కృషి చేయాలని అన్నారు. కార్మికుల ఉద్యమాల సారధి సిఐటియు రాష్ట్ర రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కార్మిక వర్గాన్ని పిలుపునిచ్చారు. మహాసభల చివరి రోజు 23వ తేదీన కార్మిక ప్రదర్శన భారీ బహిరంగ సభ కు అధిక సంఖ్యలో హాజరై కార్మికుల సత్తా చాటాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కార్మికులు వి రాములు ఈ జంగయ్య శారదమ్మ మారమ్మ కవిత మణెమ్మ తదితరులు పాల్గొన్నారు,