వైయస్సార్ టిపి ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులుగా మద్దెల ప్రసాదరావు

Published: Monday April 04, 2022
మధిర ఏప్రిల్ 3 ప్రజా పాలన ప్రతినిధి : వైయస్సార్ తెలంగాణ పార్టీ దళిత విభాగం ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా మధిర నియోజకవర్గానికి చెందిన మద్దెల ప్రసాదరావు నియామకం అయ్యారు. ఆదివారం వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కోఆర్డినేటర్ గడిపల్లి కవిత ఖమ్మం జిల్లా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ దళిత విభాగం జిల్లా అధ్యక్షుడిగా మద్దెల ప్రసాదరావు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రిటైర్డ్ సీఐగా పనిచేసిన మద్దెల ప్రసాదరావు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానంతో వైఎస్ షర్మిలకి మద్దతు ప్రకటించారు. అనంతపురం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వెంటనే ప్రజల సమస్యలపై అనేక పోరాటాలు చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తారు. దీనిని గుర్తించిన వైయస్ షర్మిల తొలుత ఖమ్మం జిల్లా ఉమ్మడి సమన్వయ కర్తగా మద్దెల ప్రసాద్ ను నియమించారు. నిరంతరం ప్రజల సమస్యలపై అధ్యయనం చేసి దశలవారీ ఉద్యమం చేపట్టిన మద్దెల ప్రసాద్ సేవలను గుర్తించి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పడిన తర్వాత రాష్ట్ర కమిటీలో స్థానంతో పాటు పార్టీ దళిత విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులుగా కల్పించారు. ఇటీవల వైఎస్ షర్మిల రాష్ట్ర జిల్లా కమిటీని రద్దు చేశారు. జిల్లాలోకి వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రవేశిస్తున్న తరుణంలో జిల్లాలో నూతన కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించిన పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిలకి రాష్ట్ర నాయకులు బండారు అంజన రాజు, పిట్టా రామిరెడ్డి, కొండా రాఘవరెడ్డి, లింగారెడ్డి, కృష్ణా రెడ్డి, బీమా రెడ్డి వేణుగోపాల్ ఖమ్మం జిల్లా ఉమ్మడి కోఆర్డినేటర్ గడిపల్లి కవితకి లక్కినేని సుధీర్ తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.