రసబాసగా మండల సర్వసభ్య సమావేశం శంకరపట్నం మార్చి09ప్రజాపాలన రిపోర్టర్:

Published: Friday March 10, 2023

శంకరపట్నం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో ఎంపీపీ ఉమ్మెత్త సరోజన అధ్యక్షతన ఎంపీవో ఎండి బషీరుద్దీన్ ఆద్వర్యంలో గురువారం జరిగిన మండల పరిషత్ సర్వే సభ్య సమావేశం కొద్దిపాటి రసభాస మద్య  జరిగినది. మండలంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అభివృద్ధి పనులపై చర్చించారు. ముందుగా వివిధ శాఖల పనితీరుపై సమావేశంలో చర్చించారు. జెడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని ప్రజా ప్రతినిధుల అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ మండల అభివృద్ధి పనులకు పాటుపడాలని అన్నారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై చర్చించడానికి అన్నీ శాఖల అధికారులు హాజరుకావాలని లేని పక్షంలో నోటీసులు జారీ చెయ్యాలని ఎంపీవోను సూచించారు. ఈ సభలో కరీంపేట ఎంపీటీసీ గాండ్ల తిరుపతి మాట్లాడుతూ కేశవపట్నం నుండి కరీంపేట వెళ్ళు రోడ్డు వెడల్పు కొరకు సభలో అధికారులను పలు మార్లు చర్చించిన ఇంతవరకు ఆ ఊసే లేదని ఆయన అన్నారు. ఇకనైనా రోడ్డు వెడల్పు పనులకు చర్యలు త్వరగా  పూర్తి చేయాలని లేని పక్షంలో మా గ్రామపక్షాన ధర్నాలు చేయడానికి అయినా వెనకాడబోమని ఆయన తెలిపారు. సభలో వివిధ గ్రామాల సర్పంచులు  స్మశాన వాటిక, సిసి రోడ్లు, ట్రాక్టర్ డీజిల్ బిల్లులు రావడం లేదని పలు ఆరోపణలు వ్యక్తం చేశారు. జాతీయ ఉపాధి హామీ పనులు ఎక్కడ సజావుగా జరగలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో  వైస్ ఎంపీపీ పులికోట రమేష్, మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు పల్లె సంజీవరెడ్డి, ఎంపీటీసీ ఫోరమ్ అధ్యక్షుడు పెద్ది శ్రీనివాస్ రెడ్డి, వివిద గ్రామల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.