ఘనంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు...

Published: Monday August 16, 2021
బీరుపూర్, ఆగస్టు 15 (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ మండలంలో ప్రతి గ్రామంలో 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల జెండాలను ఎగరేశారు. మండల కేంద్రంలోని తహశీల్దార్ ఎంపీడీఓ పోలీస్ స్టేషన్ తదితర కార్యాలయాల్లో జెండాలను మండల అధికారులు ఎగరేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మసర్తి రమేష్ జడ్పీటిసి పాత పద్మ వైస్ ఎంపీపీ బలుమురి లక్ష్మణ్ రావు తహశీల్దార్ అరిఫోద్దీన్ ఎంపీడీఓ మాల్లారెడ్డి ఎస్ఐ అనిల్ ఎంఈఓ భీమయ్యా సర్పంచులు అధికారులు నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.